న‌కిలీ ఓట్ల నిర్వాకం బీఆర్ఎస్ ఆగ్ర‌హం

Spread the love

విచార‌ణ జ‌రిపించాల‌ని మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న న‌కిలీ ఓట్ల వ్య‌వ‌హారంపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ పంచారని ఆరోపించారు. అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. వారి ఫోటోలు పెట్టుకుని మరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండ‌గా న‌కిలీ ఓట‌ర్ గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా కేసు న‌మోదు చేసింద‌ని చెప్పారు. ఇవ‌న్నీ జ‌రిగిన త‌ర్వాత‌నే పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగార‌ని వాస్త‌వాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు కేటీఆర్.

43 ఓట్లు ఉన్న సంస్కృతి అపార్ట్మెంట్ కు వెళ్లి చూడ‌డం జ‌రిగింద‌న్నారు. అక్క‌డ ఉన్న ఇంటి ఓన‌ర్ ఈ ఓట్ల‌తో ఎలాంటి సంబంధం లేద‌ని తెలిపార‌ని చెప్పారు. ఇక బూత్ నంబర్ 125 లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయని, 80 గజాలు మాత్రమే ఉన్న ఇంట్లో ఇంత మంది ఎలా వ‌చ్చారో తెలియ‌ద‌న్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కింది స్థాయి అధికారులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించు కుంటుంది అన్న అనుమానం క‌లిగింద‌న్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ లీడర్‌కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓట్లు ఉన్నాయ‌న్నారు.

  • Related Posts

    బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    Spread the love

    Spread the loveతెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు.…

    కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    Spread the love

    Spread the loveమంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *