సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రెహమాన్
హైదరాబాద్ : అందరి దృష్టి ఇప్పుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీపై ఉంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో మ్యూజిక్ లెజెండ్ అల్లా రఖా రెహమాన్ సంగీత కచేరి చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉన్నట్టుండి సడెన్ గా సర్ ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్ , జాన్వీ కపూర్. పెద్ది సినిమా ప్రమోషన్స్ ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేశారు. ఈ ఇద్దరూ కలిసి స్టేజ్ పై సందడి చేయడంతో ఫ్యాన్స్ కు ఆనందం రెట్టింపు అయ్యింది.
రెహమాన్ స్వర పరిచిన పేరు పొందిన పాటలను మరోసారి వినిపించారు. దీంతో ఈ మ్యూజిక్ కచేరికి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. వీరిని ఆశ్చర్య పోయేలా చేశారు జాన్వీ కపూర్, రామ్ చరణ్. హర్షధ్వానాల మధ్య రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. తన చిన్ననాటి నుంచి ఒక కల ఉండేదని, ఏనాటికైనా రెహమాన్ సర్ మ్యూజిక్ తన సినిమాకు అందిస్తే బావుంటుందని. తన కల గేమ్ ఛేంజర్ తో పాటు ప్రస్తుతం పెద్ది మూవీతో తీరి పోయిందన్నారు చెర్రీ. చికిరి అన్ని భాషలలో రికార్డు స్థాయిలో వింటున్నారని తెలిపారు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందన్నారు. పెద్దితో తను భాగస్వామ్యం కావడం పట్ల మరితం సంతోషం కలిగిస్తోందన్నారు.








