సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే బెట‌ర్

Spread the love

ఐ బొమ్మ ర‌వి తండ్రి అప్పారావు కామెంట్స్

హైద‌రాబాద్ : పైర‌సీ వీడియోలు చ‌ట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయ‌లు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం క‌లిగించాడంటూ ఐబొమ్మ‌, బొప్పం ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌విని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ సజ్జ‌నార్ అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో త‌న‌ను 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సంద‌ర్బంగా సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున‌, నిర్మాతలు దిల్ రాజుతో పాటు సి. క‌ళ్యాణ్ స్పందించారు. పోలీసుల‌ను అభినందించారు. ఈ సంద‌ర్బంగా ప్రొడ్యూస‌ర్ సి. క‌ళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఇమ్మ‌డి ర‌విని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని, ఇక నుంచి ఎవ‌రూ అలాంటి ప‌నులు చేయ‌రంటూ పేర్కొన్నాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఐబొమ్మ ర‌వి తండ్రి అప్పారావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే పీడ విర‌గ‌డ అవుతుంద‌న్నారు. ఒక‌రిపై కామెంట్స్ చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాల‌న్నారు. సీ.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంద‌ని అన్నారు అప్పారావు. సినిమాల‌లో ద‌మ్ముంటే జ‌నం క‌చ్చితంగా చూస్తార‌న్నారు. తాను ఒక‌ప్పుడు 45 పైసలతో సినిమా చూశాన‌ని, ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయన్నారు ఐ బొమ్మ‌ర‌వి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారని ప్ర‌శ్నించారు. త‌న‌ కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అప్పారావు.

  • Related Posts

    దురంధ‌ర్ -2 మూవీ అద్బుతంగా ఉంది

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది ఈ…

    క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

    Spread the love

    Spread the loveఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు న‌టి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *