కొండారెడ్డిప‌ల్లి స‌ర్పంచ్ ఏక‌గ్రీవం

సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడే ఇత‌డు

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల కోలాహ‌లం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల‌న్నీ క‌ళ‌క‌ళ లాడుతున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా చాలా చోట్ల గ్రామాల స‌ర్పంచ్ ల ప‌ద‌వులు ఏక‌గ్రీవం అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంద‌రి దృష్టి ప్ర‌త్యేకంగా ప‌డింది సీఎం ఎ. రేవంత్ రెడ్డికి చెందిన స్వంత ఊరు. ఇక్క‌డ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని అనుకున్నారు. కానీ ఏక‌గ్రీవం అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేశారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని వంగూరు మండ‌లం కొండారెడ్డి ప‌ల్లె గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్ ప‌ద‌విని ఏక‌గ్రీవం చేశారు. గ్రామ‌స్తులంతా తామంతా ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు.

విచిత్రం ఏమిటంటే సీఎం అనుముల రేవంత్ రెడ్డి చిన్న‌నాటి స్నేహితుడైన మ‌ల్లెపాకుల వెంక‌ట‌య్య ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. త‌ను ఏరికోరి త‌న‌ను నిల‌బెట్టారు. సీఎం త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ప‌ల్లెవాసులంతా స‌పోర్ట్ చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన త‌న‌ను గ్రామ‌స్థులంతా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఇదే స‌మ‌యంలో త‌న బాల్య మిత్రుడు స‌ర్పంచ్ గా ఎన్నికైనందుకు ఆనందంగా ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పోటీ లేదు, శ‌త్రుత్వం లేదు. అంత‌కు మించిన ప్రేమ‌తో క‌లిసికట్టుగా ముందుకు రావ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగించేలా చేసింద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *