బ‌స్సు ప్ర‌మాదం ప‌లువురు స‌జీవ ద‌హ‌నం

Spread the love

క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న బాధాక‌రం

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో గురువారం తెల్ల‌వారుజామున ఘోర బస్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బెంగ‌ళూరు నుంచి శివ‌మొగ్గ‌కు ప్ర‌యాణం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న జాతీయ ర‌హ‌దారి 48వ నెంబ‌ర్ పై చోటు చేసుకుంది. బ‌స్సులో మొత్తం 31 మంది ప్ర‌యాణిస్తున్నార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 18 మందికి పైగా స‌జీవ ద‌హ‌నం అయ్యిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే చిత్ర‌దుర్గ ఎస్పీ హుటా హుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. ప‌లువురు గ‌ల్లంతైన‌ట్లు స‌మాచారం. ర‌హ‌దారిపై ఉన్న డివైడ‌ర్ ను ఢీకొన్న ట్ర‌క్కు (లారీ) ఎదురుగా వ‌స్తున్న బ‌స్సును ఢీకొట్టింది. దీంతో బ‌స్సులో మంట‌లు ఒక్క‌సారిగా చెల‌రేగాయి. గురువారం ఉద‌యం 2.30 నుంచి 3 గంట‌ల ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, లారీ బస్సు ఇంధన ట్యాంకును ఢీకొనడంతో ఇంధనం బయటకు చిమ్మింది. కొందరు ప్రయాణికులు మంటల నుండి తప్పించు కోగలిగారు. ఇప్పటి వరకు 18 మంది ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ మరణించినట్లు వెల్ల‌డించారు క‌ర్ణాట‌క ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికాంత్ గౌడ తెలిపారు. సీబార్డ్ కోచ్‌కు చెందిన ఈ బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో సహా 32 మంది ఉన్నారని సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. బ‌స్సు ప్ర‌మాదం ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. చ‌ని పోయిన వారి కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *