ఆ వెంక‌న్న మా మొర ఆల‌కించాడు

VijayaBhaskar · February 20, 2026
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా భువ‌నేశ్వ‌రి

అమ‌రావ‌తి : హెరిటేజ్ ఎండీ, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌మ సంస్థ హెరిటేజ్ ద్వారా త‌యారు చేస్తున్న ఉత్ప‌త్తుల నాణ్య‌త‌పై కీల‌క తీర్పు వెలువ‌రించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం నారా భువ‌నేశ్వ‌రి ఎక్స్ మాధ్య‌మం వేదిక‌గా స్పందించారు. కొంద‌రు కావాల‌ని త‌మ సంస్థ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని , ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు నారా భువ‌నేశ్వ‌రి.

హెరిటేజ్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆనందంగా ఉంద‌న్నారు. గ‌త 33 ఏళ్లుగా తాజా పాల ఉత్పత్తులను అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుందని స్ప‌ష్టం చేశారు. 500 మందికిపైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని తెలుసు కోవాల‌ని అన్నారు. చూసిందే న‌మ్మాల‌ని కోరారు.