ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు

Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తమ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హెరిటేజ్ సంస్థ‌పై అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్న‌రంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌త్యేకించి ప‌నిగ‌ట్టుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారం కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు. ‘హెరిటేజ్’ గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ‘హెరిటేజ్’ మా కుటుంబ వ్యాపార సంస్థ అని చెప్పారు. ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా మా ఉత్పత్తులు సరఫరా కాలేదని స్ప‌ష్టం చేశారు. వాళ్ల పత్రికలో మాత్రం హెరిటేజ్‌కు వ్యతిరేకంగా కథనాలు రాశార‌ని ఆరోపించారు. .ప్రభుత్వ సహకారం లేకుండా హెరిటేజ్ నిజాయతీగా వ్యాపారం చేస్తోందని స్ప‌ష్టం చేశారు సీఎం.

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు . హెరిటేజ్ డెయిరీ నిత్యం 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోందని చెప్పారు. నెయ్యి విషయంలో ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు సంబంధం లేద‌ని అన్నారు. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు . హెరిటేజ్ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, అబ‌ద్ద‌మ‌ని మండిప‌డ్డారు నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    మ‌హిళ‌ల జోలికి వ‌స్తే తాట తీస్తం : అనిత

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి అమ‌రావ‌తి : రాష్ట్రంలో మ‌హిళ‌లు, చిన్నారుల భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాస‌న మండ‌లిలో లా అండ్ ఆర్డ‌ర్ పై ప‌లు ప్ర‌శ్న‌లు…

    మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవ‌లు

    Spread the love

    Spread the loveఅందు బాటులోకి తీసుకు వ‌చ్చిన సంస్థ హైద‌రాబాద్ : ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. తాజాగా ‘మీ సేవ’ మొబైల్ ఆప్ లో TGSRTC బస్ టిక్కెట్ పొందే సౌకర్యం క‌ల్పించింది. సచివాలయంలో రవాణా శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *