క్రికెట‌ర్ శివం దూబే భార్య ముస్లిం

Spread the love

సంచ‌ల‌నంగా మారిన ప్లేయ‌ర్ క‌థ‌

ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది భార‌త జ‌ట్టు. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీం ఇండియా ఫైన‌ల్ లో న్యూజిలాండ్ ను 96 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది . విశ్వ విజేత‌గా నిలిచింది. ఇక భార‌త్ గెల‌వ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు సంజూ శాంస‌న్, బుమ్రా, ఇషాన్ కిష‌న్ , శివం దూబే. దీంతో దూబే మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. త‌న గురించి ఫ్యాన్స్ వెత‌క‌డం మొద‌లు పెట్టారు. శివం దూబే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. అతని తండ్రి పేరు రాజేష్ దూబే , తల్లి పేరు మాధురి దూబే.

శివం దూబే తన కులం, మతం వెలుపల వివాహం చేసుకున్నాడు. అతని భార్య అంజుమ్ ఖాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మోడల్, నటి. ఆమె అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థిని కూడా. వీరు జూలై 16, 2021న వివాహం చేసుకున్నారు, వీరి వివాహం హిందూ , ముస్లిం సంప్రదాయాలు రెండింటి ప్రకారం జరిగింది. వీరిది మతాంతర వివాహం కావడంతో, శివం దూబే తండ్రి కొంత మంది బంధువుల నుండి విమర్శలను, తీవ్ర వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శివం దూబే, అంజుమ్ ఖాన్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయాన్ అనే కుమారుడు, మహ్విష్ అనే కుతూరు ఉంది.

  • Related Posts

    న్యూ జెర్సీ ధ‌రించిన సంజు శాంస‌న్

    Spread the love

    Spread the loveఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాటాడు చెన్నై : కేర‌ళ క్రికెట్ స్టార్ సంజు శాంస‌న్ సంచ‌ల‌నంగా మారాడు. ఇప్ప‌టికే త‌ను నేష‌న‌ల్ హీరో అయ్యాడు. మొన్న‌టి దాకా త‌ను విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఆ త‌ర్వాత…

    సంజు శాంస‌న్ మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్

    Spread the love

    Spread the loveమాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్ ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ మాథ్యూ హేడ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఇండియాలో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపిన కేర‌ళ స్టార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *