న్యూ జెర్సీ ధ‌రించిన సంజు శాంస‌న్

Spread the love

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాటాడు

చెన్నై : కేర‌ళ క్రికెట్ స్టార్ సంజు శాంస‌న్ సంచ‌ల‌నంగా మారాడు. ఇప్ప‌టికే త‌ను నేష‌న‌ల్ హీరో అయ్యాడు. మొన్న‌టి దాకా త‌ను విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఆ త‌ర్వాత అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకున్నాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కేవ‌లం అయిదు ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు. మొత్తం భార‌త జ‌ట్టు త‌ర‌పున ఏ ప్లేయ‌ర్ చేయ‌ని విధంగా త‌ను 321 ర‌న్స్ చేశాడు. టాప్ లో నిలిచాడు. మొత్తం టోర్నీలో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు పొందాడు. ఒకానొక ద‌శ‌లో జ‌ట్టులో ఎంపికైన‌ప్ప‌టికీ త‌న‌ను ప‌క్క‌న పెట్టింది మేనేజ్మెంట్. దీంతో అభిషేక్ శ‌ర్మ కు అనారోగ్యం క‌ల‌గడం, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేష‌న్ ఉండాల‌ని ఆశించింది. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక సంజు శాంస‌న్ కు ఛాన్స్ ఇచ్చింది.

ఈ త‌రుణంలో న‌మీబియాతో 22 ర‌న్స్ , జింబాబ్వే తో 24 ర‌న్స్ చేశాడు. కీల‌క‌మైన కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో ఒంటి చేతితో విండీస్ పై విజ‌యం సాధించేందుకు దోహ‌ద ప‌డ్డాడు. త‌ను ఒక్క‌డే 97 ర‌న్స్ చేశాడు. ఆ త‌ర్వాత సెమీఫైన‌ల్ లో ముంబై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 89 ప‌రుగులతో స‌త్తా చాటాడు. ఇక కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా రెచ్చి పోయాడు. 46 బంతులు ఎదుర్కొని 7 సిక్స‌ర్లు, 4 ఫోర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఇండియా విజ‌యంలో కీ రోల్ పోషించాడు. ఇక ఈనెల 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను వీడిన శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు మారాడు. ఇవాళ త‌ను జ‌ట్టుకు సంబంధించిన జెర్సీని ధ‌రించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

  • Related Posts

    క్రికెట‌ర్ శివం దూబే భార్య ముస్లిం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌నంగా మారిన ప్లేయ‌ర్ క‌థ‌ ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది భార‌త జ‌ట్టు. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీం ఇండియా ఫైన‌ల్ లో న్యూజిలాండ్ ను 96 ప‌రుగుల భారీ…

    సంజు శాంస‌న్ మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్

    Spread the love

    Spread the loveమాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్ ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ మాథ్యూ హేడ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఇండియాలో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపిన కేర‌ళ స్టార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *