శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

Spread the love

అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన సీఎం చంద్ర‌బాబు

అమరావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం శాస‌న స‌భ‌లో చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్బంగా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్ట‌డాన్ని మంత్రివ‌ర్గం , ప్ర‌జా ప్ర‌త‌నిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు.

రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయటం ద్వారా రాజధానిపై స్పష్టతను ,స్థిరత్వాన్ని కల్పించ వచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు శాస‌న స‌భ వేదిక‌గా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే స్పీక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు .ఆ మేర‌కు రూల్ కూడా ప్ర‌వేశ పెట్టారు. మొత్తంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తికి లైన్ క్లియ‌ర్ కానుంది. అలా కావాలంటే పార్ల‌మెంట్ లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

  • Related Posts

    నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌నంగా మారిన ప్ర‌తిభా రావ‌ల్ ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్త‌గా మంత్రివ‌ర్గం కొలువు తీరింది. శ‌నివారం అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఏడాదిలో జ‌రిగిన హింస‌కు కార‌ణం మాజీ ప్ర‌ధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

    బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైద‌రాబాద్ : రాష్ట్ర‌, రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పెద్ద పీట వేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు. శ‌నివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *