పన్ను కట్టక పోవడంతో జీహెచ్ఎంసీ షాక్
హైదరాబాద్ : తమిళనాడు మాజీ సీఎం, దివంగత కుమారి జయలలితకు చెందిన కుటుంబీకులకు షాక్ తగిలింది. తనకు సంబంధించిన ఆస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిలో ఎక్కువగా తమిళనాడుతో పాటు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా తన నివాసానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ఇంటికి గాను ఇప్పటి వరకు ఇంటి పన్ను చెల్లించక పోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ). నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిల కారణంగా జయలలిత హైదరాబాద్ నివాసం సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో, 8-3-1099/A అనే ఇంటి నంబరుతో ఉన్న ఈ ఆస్తికి సంబంధించి, 2017 నుండి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించిన తర్వాత దీనిని సీజ్ చేశారు. ఈ బకాయిలకు సంబంధించి పలు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ ఆస్తితో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి స్పందన రాలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపులు నిరంతరాయంగా నిలిచి పోవడంతో ఆ ఇంటిని సీజ్ చేశారు.






