అరాచ‌క పాల‌న సాగిస్తున్న స్టాలిన్ : విజ‌య్

VijayaBhaskar · March 31, 2026
Spread the love


త‌న ఆస్తుల విలువ రూ. 640 కోట్లు

చెన్నై : టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి డీఎంకే పార్టీపై, అధికారంలో కొన‌సాగుతున్న స్టాలిన్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి రాష్ట్రంలో. పెరంబూరులో ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న ఆస్తుల విలువ రూ. 640.50 కోట్లు అని వెల్ల‌డించారు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో. నామినేష‌న్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు విజ‌య్. సీఎం స్టాలిన్ ను ఏకి పారేశారు. త‌ను అరాచ‌క పాల‌న‌కు తెర తీశార‌ని, త‌న‌కు మంగళం పాడాల‌ని పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీని దుష్ట శ‌క్తిగా పేర్కొన్నారు. తాను గతంలో చేసిన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు.

మనం తమిళనాడును కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేశార‌ని సీఎంపై మండిప‌డ్డారు. ఈ ద‌య‌నీయ స్థితికి కార‌ణం డీఎంకే స‌ర్కార్ అని ఆరోపించారు విజ‌య్. తనపై ప్రజలకు ఉన్న అభిమాన రుణం తీర్చుకోవడానికే, తాను సుఖవంతమైన జీవితాన్ని త్యజించి రాజకీయాల్లోకి వచ్చానని ప్ర‌క‌టించారు. నేను ఎంతో బాధను భరించి, కేవలం మీ కోసమే (రాజకీయాల్లోకి) వచ్చాను. నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను, మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయను అని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్న స్టాలిన్ మీకు కావాలా? లేక ప్రజలను ప్రేమించే విజయ్ మీకు కావాలా? అనేది మీరే తేల్చు కోవాల‌ని అన్నారు.