పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం

VijayaBhaskar · April 8, 2026
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. .అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేద‌న చెందారు. టెక్నాలజీని వినియోగిస్తున్నాం… కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం అని ప్ర‌శ్నించారు. ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదు క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందినీ అలెర్ట్ చేయాలని ఆదేశించారు సీఎం. అలాగే ఫలానా టవర్ లోకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని నెట్ వర్క్ ద్వారా ప్రజలకు తెలియచేసేలా చూడాలి అని ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్2.0 మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ప్ర‌ధానంగా అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని అన్నారు. ఇలాంటి వాటిని నివారించాలని సూచించారు సీఎం. కఠినంగా నిబంధనలు అమలు చేయడానికంటే ముందు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని హిత‌వు ప‌లికారు నారా చంద్ర‌బాబు నాయుడు. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు తమ కోసమేననేది ప్రజలు అర్థం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటివి ఇకపై జరగడానికి వీళ్లేదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.