మేనిఫెస్టో ప్ర‌క‌టించిన టీవీకే విజ‌య్

VijayaBhaskar · April 12, 2026
Spread the love

అవినీతి ర‌హిత పాల‌న అందిస్తాం

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఏప్రిల్ 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆపై మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా 21వ శతాబ్దపు సుపరిపాలన అజెండాను ప్ర‌జ‌ల సాక్షిగా ముందుంచారు.
అన్ని ప్రభుత్వ పథకాలను అవినీతి రహితంగా అందిస్తామ‌న్నారు. ప్రతి కుటుంబానికి పౌర ప్రత్యేకాధికార కార్డు ఇస్తామ‌న్నారు. ఏఐ ఆధారిత పాలన పై ఫోక‌స్ పెడ‌తామ‌ని, ఇంటి వద్దకే సేవలు అంద‌జేస్తామ‌న్నారు టీవీకే విజ‌య్.

6 నెలల్లోగా సేవా హక్కు చట్టం తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. అన్ని సేవల కోసం “వెట్రి తమిళనాడు” సూపర్ యాప్ తీసుకు వ‌స్తామ‌న్నారు. మధ్యవర్తులు లేరు, జాప్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. పౌర భాగస్వామ్యంతో రియల్ టైమ్ పాలన అందిస్తామ‌న్నారు. అసెంబ్లీలో ప్రజా వినతి పత్రాలపై చర్చించేలా చేస్తామ‌న్నారు. భారతదేశ ఏఐ, డిజిటల్ రాజధానిగా తమిళనాడు రాష్ట్రాన్ని మారుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏఐ విశ్వవిద్యాలయం, ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామ‌న్నారు టీవీకే విజ‌య్.
అప్పుల తగ్గింపు, అదనపు పన్నుల భారం లేకపోవడం, కొత్త ఆదాయ నమూనాలపై దృష్టి సారిస్తామ‌న్నారు.