హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అశ్విన్ కామెంట్స్

ఆర్సీబీ చేతిలో ఓట‌మి పాలైన ముండై ఇండియ‌న్స్

ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓట‌మి పాలైంది స్వంత గ‌డ్డ‌పై ముంబై ఇండియ‌న్స్. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ముంబై జ‌ట్టు స్కిప్ప‌ర్ పాండ్యా. దీనిని ఛాన్స్ గా తీసుకున్న ఆర్సీబీ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంది. ఏకంగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 240 ర‌న్స్ చేసింది. భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది. ఫిన్ సాల్ట్ రెచ్చి పోగా ఎప్ప‌టి లాగే ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. ఈ సంద‌ర్భంగా పాండ్యా తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తీవ్రంగా స్పందించాడు మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ అన‌లిస్ట్ ర‌విచంద్ర‌న్ అశ్విన్.

ముఖ్యంగా ప్రత్యర్థి రజత్ పాటిదార్‌కు వ్యతిరేకంగా హార్దిక్ పాండ్యా చేసిన కెప్టెన్సీ తప్పిదాలపై ప్ర‌త్యేకంగా ఎత్తి చూపాడు. జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్నప్పుడు ముందు వెనుకా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంద‌న్నాడు ఆర్. అశ్విన్. మయాంక్ మార్కండేను ఉపయోగించడం హార్దిక్ చేసిన పెద్ద పొరపాటు అని పేర్కొన్నాడు. దీంతో ర‌జ‌త్ పాటిదార్ అద్భుతంగా ఆడాడ‌ని పేర్కొన్నాడు. త‌న‌తో పాటు ఫిల్ సాల్ట్, కోహ్లీ తోడు కావ‌డంతో ఆర్సీబీ భారీ స్కోర్ న‌మోదు చేయ‌గ‌లిగింద‌ని తెలిపాడు. విచిత్రం ఏమిటంటే మార్కండే బౌలింగ్ లో పాటిదార్ నాలుగు సిక్స్ లు కొట్ట‌డాడ‌ని అన్నాడు. అదే ముంబై జ‌ట్టును కొంప ముంచింద‌న్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *