newsseals.com
SPORTS

క్రికెట్ లెజండ్ క‌పిల్ దేవ్ తో గంటా భేటీ

VijayaBhaskar April 12, 2026
newsseals-GantaSrinivasRao
Spread the love

ఈ క‌ల‌యిక మ‌రిచి పోలేనంటూ కామెంట్స్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ క్రికెట్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ఏకైక క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ నిఖంజ్. త‌న‌ను ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ లెజెండ్ గా గుర్తిస్తారు. కోట్లాది మంది భార‌తీయులు ఇప్ప‌టికీ త‌న‌ను ప్రేమిస్తారు. ఆరాధిస్తారు కూడా. 1983లో దేశానికి మొట్ట మొదటి వరల్డ్ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ త‌ను. క‌పిల్ దేవ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా హైద‌రాబాద్ లో క‌లుసుకున్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు. ఈ విష‌యాన్ని ఆయ‌న పంచుకున్నారు.

హైదరాబాద్ లో కలిసి డిన్నర్ చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు గంటా. 43 ఏళ్ల క్రితం నాటి క్రికెట్ గురించి, నేటి తరం క్రికెట్ గురించి.. చాలాసేపు మాట్లాడుకున్నాం అని తెలిపారు. అనేక క్రికెట్ జ్ఞాపకాలను కపిల్ దేవ్ మాతో పంచుకున్నారని పేర్కొన్నారు. . పొలిటికల్ ఐకాన్, ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కపిల్ దేవ్ కి వివరించడం జరిగిందన్నారు గంటా శ్రీ‌నివాస‌రావు. సిటీ ఆఫ్ డెస్టినీ.. విశాఖకు రావాలని ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. త‌మ కోరిక‌ను క‌పిల్ దేవ్ మ‌న్నించార‌ని వెల్ల‌డించారు . విశాఖ అంటే తనకు కూడా చాలా ఇష్టమని.. తొందర్లోనే అక్కడ గోల్ఫ్ కోర్స్ కు వస్తానని కపిల్ చెప్పారన్నారు.