ఆర్టిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

VijayaBhaskar · April 18, 2026
Spread the love

ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్క‌ర్ ప్ర‌య‌త్నం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ నాయకులతో ఈ రోజు ప్రజా భవన్‌లో సమావేశమై వారి సమస్యలపై చర్చించడం జ‌రిగింద‌న్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.స్ప‌ష్టం చేశారు, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో వెంటనే సమావేశమై అంశాల వారీగా చర్చించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.

మనది ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఉద్యోగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు తాముఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అని ప్ర‌క‌టించారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించినందుకు జేఏసీ నాయకులను అభినందిస్తున్నానని అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ప్ర‌స్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని స‌హ‌క‌రించాల‌ని కోర‌డం జ‌రిగింద‌న్నారు. ఆర్టిజ‌న్లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.