సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. తాజాగా ఐపీఎల్ 2026లో కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు వేదిక కాబోతోంది హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం. ఈ సంద‌ర్బంగా జ‌హీర్ ఖాన్ స్పందించాడు. సంజు శాంస‌న్ బ్యాటింగ్ ఎలా ఉంద‌నే దానిపై త‌న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గత 2–3 ఏళ్లుగా సంజు శాంసన్ ప్రదర్శనను గమనిస్తే, గతంలో అతను సిక్సర్లు బాదడం పైనే ఎక్కువగా దృష్టి సారించే వాడ‌ని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు, అతను సిక్సర్ల సంఖ్యను తగ్గించి, ఫోర్లను ఎక్కువగా ఆడేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని తెలిపాడు.

రాను రాను సంజు శాంస‌న్ మరింత ప్రమాద రహితమైన (risk-free) విధానం వైపు మారాడని సూచిస్తుందన్నాడు జ‌హీర్ ఖాన్. అలా ఉన్నప్పటికీ ఇప్పటికీ 200కి పైగా స్ట్రైక్ రేట్‌ను కొనసాగిస్తుండ‌డం సీఎస్కే జ‌ట్టుకు శుభ ప‌రిణామ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు మాజీ క్రికెట‌ర్. ఇప్పుడు, అతను నియంత్రిత దూకుడుతో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడని , ఇదే కంటిన్యూ చేయాల‌ని సూచించాడు సంజు శాంస‌న్ కు.ఇది జట్టులో అతనిపై నమ్మకాన్ని పెంచడంతో పాటు, ఒక నమ్మదగిన ఆటగాడిగా అతన్ని నిలబెడుతోందని అన్నాడు. ఇది అతని విధానంలో వచ్చిన మార్పును స్పష్టంగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *