సెంచరీతో కదం తొక్కిన కేరళ స్టార్
ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డ్ సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు కూలుతున్నా ఎక్కడా తల వంచ లేదు. జట్టు కోసం చివరి ఓవర్ దాకా ఉన్నాడు. తను అడ్డు గోడగా నిలిచాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు . కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో చెన్నై ఫ్యాన్స్ సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. స్టేడియం అంతటా తళా, చెట్టా అంటూ పెద్ద ఎత్తున అరుపులతో హోరెత్తించారు.
ఇక సంజు శాంసన్ కేవలం 54 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 10 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఉతికి ఆరేశాడు. తను వేసిన 2 ఓవర్లలో 34 పరుగులు పిండుకున్నారు చెన్నై బ్యాటర్లు. రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ లు సైతం సంజు శాంసన్ కు తోడుగా నిలిచారు. అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఏ కోశాన పోరాటం చేయలేక పోయారు. చెన్నై బౌలర్ల ధాటికి విల విల లాడారు. కేవలం 104 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యారు. దీంతో ఐపీఎల్ లో మూడో విజయాన్ని నమోదు చేసి.. మెరుగైన రన్ రేట్ తో 5వ ప్లేస్ లోకి వెళ్లింది సీఎస్కే.






