ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాం : పాండ్యా

Spread the love

ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు బాగా ఆడింది

ముంబై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు చేతిలో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 207 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరుతో నిరాశ ప‌రిచింది. ఏ కోశాన ఎదుర్కోలేక పోయింది చెన్నై బౌల‌ర్ల‌ను. దెబ్బ‌కు 104 ప‌రుగులు మాత్ర‌మే చేసి చాప చుట్టేసింది. ఈ సంద‌ర్బంగా మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియన్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.

మా సొంత మైదానంలో ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం అన్నాడు. ఈ పరాజయంతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొ్నాడు పాండ్యా. ఒక జట్టుగా, ఈ రోజు మా బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ ఏదీ ఆశించిన స్థాయిలో రాణించ లేద‌న్నాడు. ఈ ఓటమి నుంచి కోలుకుని, రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా ఆడటానికి తాము ప్ర‌యత్నం చేస్తామ‌ని చెప్పాడు. ఇక్కడి నుంచి పరిస్థితులను చక్కదిద్దడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తాను భావిస్తున్నాన‌ని పేర్కొన్నాడు.

  • Related Posts

    సంజు శాంస‌న్ రియ‌ల్ టార్చ్ బేర‌ర్

    Spread the love

    Spread the loveసెంచ‌రీతో క‌దం తొక్కిన కేర‌ళ స్టార్ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డ్ సృష్టించాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు…

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *