త‌మిళ‌నాడులో ఎన్డీయే కూట‌మిదే విజ‌యం

ధీమా వ్య‌క్తం చేసిన పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే స‌ర్కార్ ను ఎలాగైనా స‌రే ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది అన్నాడీఎంకే, భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన ఎన్డీయే కూట‌మి. మ‌రో వైపు అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ , ఇండియా కూట‌మి ఫుల్ కాన్పిడెన్స్ తో ఉంది . ఈ సారి కూడా తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని . మ‌రో వైపు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌ణ‌రంగాన్ని త‌ల‌పింప చేస్తోంది. ఈ త‌రుణంలో ఆయా పార్టీల‌లో త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లు, ఆయా పార్టీల చీఫ్ లు పెద్ద ఎత్తున ప్ర‌చారంలో త‌ల మున‌క‌లై పోయారు.

ఏపీ రాష్ట్రానికి చెందిన టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర టెలికాం శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , త‌దిత‌రులు విస్తృతంగా పాల్గొన్నారు ఎన్నిక‌ల ప్ర‌చారంలో. ఇదిలా ఉండ‌గా ఈనెల 23న పోలింగ్ జ‌ర‌గ‌నుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి త‌ప్ప‌కుండా ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *