Friday, 16 October 2026

ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

newsseals-RevanthReddy

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో నిధుల కొర‌త లేద‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా
రాబోయే రోజుల‌లో గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించామ‌న్నారు. తాజాగా కాళేశ్వరంలో 198 కోట్ల రూపాయలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.

అంతకు ముందు స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ పనులతో పాటు కాళేశ్వరం బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *