రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

VijayaBhaskar · April 22, 2026
Spread the love

ఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్

చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం రూ. 1262 కోట్లు కాగా, ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 543 కోట్లు అని తెలిపారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిచోటా, అన్ని కేసులలోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయని చెప్పారు. మా నియంత్రణ కేంద్రాలకు అందుతున్న అన్ని ఫిర్యాదులపైనా తాము చర్యలు తీసుకుంటున్నాం అని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు జరిగేలా చూడటానికే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం 300 కంపెనీలను సిద్ధం చేశామన్నారు, వాటి నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగేలా తాము చూస్తామ‌న్నారు.