ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాం : పాండ్యా

VijayaBhaskar · April 24, 2026
Spread the love

ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు బాగా ఆడింది

ముంబై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు చేతిలో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 207 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరుతో నిరాశ ప‌రిచింది. ఏ కోశాన ఎదుర్కోలేక పోయింది చెన్నై బౌల‌ర్ల‌ను. దెబ్బ‌కు 104 ప‌రుగులు మాత్ర‌మే చేసి చాప చుట్టేసింది. ఈ సంద‌ర్బంగా మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియన్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.

మా సొంత మైదానంలో ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం అన్నాడు. ఈ పరాజయంతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొ్నాడు పాండ్యా. ఒక జట్టుగా, ఈ రోజు మా బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ ఏదీ ఆశించిన స్థాయిలో రాణించ లేద‌న్నాడు. ఈ ఓటమి నుంచి కోలుకుని, రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా ఆడటానికి తాము ప్ర‌యత్నం చేస్తామ‌ని చెప్పాడు. ఇక్కడి నుంచి పరిస్థితులను చక్కదిద్దడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తాను భావిస్తున్నాన‌ని పేర్కొన్నాడు.