బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి
హైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా త‌మ కుటుంబంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవ‌లం త‌మ సంస్థ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కోరేందుకు ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. పార్టీ మార‌బోవ‌డం లేద‌న్నారు మ‌ల్లారెడ్డి.

పార్టీ మారుతున్నారనే ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. అవన్నీ అవాస్తవ ప్రచారాలే అని ఆయన కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి సందేహాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తాజాగా జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మ‌ల్లారెడ్డిపై సీరియ‌స్ అయిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *