కీలక వ్యాఖ్యలు చేసిన శ్రేయాస్ అయ్యర్
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా రెండోసారి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. వరుస విజయాలతో దూసుకు పోతున్న జట్టుకు అనుకోని షాక్ తగిలింది. ఈ సందర్బంగా పంజాబ్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు వరుస విజయాలతో ఊపు మీద ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయక పోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల నేను నిజంగా నిరాశ చెందాను. పవర్‌ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని పేర్కొన్నాడు శ్రేయాస్ అయ్యర్. ;అయితే, మార్కస్ స్టోయినిస్ ,సూర్యాంశ్ షెడ్గే అద్భుతంగా బ్యాటింగ్ చేసి మమ్మల్ని తిరిగి పోటీలోకి తీసుకు వచ్చారు. అయినప్పటికీ, విజయానికి అవసరమైన స్కోరు కంటే మేము సుమారు 20-25 పరుగులు తక్కువ చేశామని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని, తదుపరి మ్యాచ్‌లో మరింత బలంగా పుంజుకుంటామని ఆశిస్తున్నానని చెప్పాడు.





