newsseals.com
SPORTS

ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

VijayaBhaskar May 5, 2026
newsseals-RohitShaarma
Spread the love

మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను ఓడించింది. ముంబై ఓపెన‌ర్లు దంచికొట్టారు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. తొలి వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. గాయం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆడ‌లేక పోయిన భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ తో పాటు రెకెల్ట‌న్ లు క‌లిసి దంచికొట్టారు. రోహిత్ 84 ర‌న్స్ చేస్తే రెకెల్ట‌న్ 83 ప‌రుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 228 ర‌న్స్ చేసింది. అనంత‌రం భారీ ఛేద‌న‌ను ఛేదించ‌లేక చ‌తికిల‌ప‌డింది ల‌క్నో.

ఈ సంద‌ర్బంగా మ్యాచ్ గెలిచిన అనంత‌రం రోహిత్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు. అవును, నా గాయం ఇప్పుడు దాదాపుగా నయమైంది. అయితే, జట్టుకు నా భాగస్వామ్యం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు కాబట్టి, ఈ రోజు నేను నా సొంత పూచీకత్తుపైనే (own risk) ఆడాను. అందుకే నేను ఈ సాహసం చేశాను. ఆ రిస్క్ తీసుకుని, ఈ రోజు ఆడగలిగినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము వరుసగా కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోయాము, కానీ ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా పెంచుతుంది అని అన్నాడు రోహిత్ శ‌ర్మ‌.