Friday, 16 October 2026

ట్రాఫిక్ జామ్ నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక క‌మిటీ

newsseals-DGPCVAnand

ఏర్పాటు చేస్తున్నామ‌న్న డీజీపీ సీవీ ఆనంద్

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌త్యేకంగా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నూత‌న డీజీపీ సీవీ ఆనంద్. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని డిజిపి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు .

ఐఎస్ డబ్ల్యూ, సీఎస్ డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి. సజ్జనార్, సైబరాబాద్ సిపి ఎం. రమేష్, మల్కాజిగిరి సిపి బి. సుమతి, ఫ్యూచర్ సిటీ జాయింట్ సిపి చందనా దీప్తి, రైల్వేలు , రోడ్డు సేఫ్టీ ఐజిపి రమేష్ నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఐఎస్డబ్ల్యూ ఓఎస్డి కమలాసన్ రెడ్డి, సిఎంఎస్జి ఎస్పీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *