డీ లిమిటేష‌న్ పై జ‌న‌సేన క‌మిటీ ఏర్పాటు

Spread the love

ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. డీ లిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, అన‌కాప‌ల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, ఆరణి శ్రీనివాసులు గారు ( తిరుపతి), శ్రీ పంతం నానాజీ (కాకినాడ రూరల్), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) ల‌ను నియ‌మించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

వీరితో పాటు సీహెచ్ వంశీకృష్ణ గారు (విశాఖ సౌత్), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్ల‌డించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లోనే పార్టీ చీఫ్ నియ‌మితులైన క‌మిటీ స‌భ్యుల‌కు దిశా నిర్దేశం చేస్తార‌ని తెలిపారు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు కొణిద‌ల‌.

  • Related Posts

    టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు

    Spread the love

    Spread the loveపోసాని కృష్ణ ముర‌ళి సంచ‌ల‌న కామెంట్స్ హైద‌రాబాద్ : త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంపై అంతా ఆస‌క్తితో…

    సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న విజ‌య్

    Spread the love

    Spread the loveత‌మిళ‌నాడు లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. 243 స్థానాల‌కు గాను 108 సీట్లు సాధించింది ఒంట‌రిగా టీవీకే విజ‌య్. మ‌రో వైపు డీఎంకే,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *