newsseals.com
SPORTS

త‌ప్ప‌కుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాం

VijayaBhaskar May 10, 2026
newsseals-YashashviJaiswal
Spread the love

ధీమా వ్య‌క్తం చేసిన స్టాండింగ్ కెప్టెన్ జైస్వాల్

జైపూర్ : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టాండింగ్ కెప్టెన్ య‌శ‌స్వి జైస్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా జైపూర్ స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని విధంగా భారీ తేడాతో ఓటమి పాలైంది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో. రెగ్యుల‌ర్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ ఈ మ్యాచ్ కు దూరం కావ‌డంతో త‌న స్థానంలో జైశ్వాల్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 229 ప‌రుగులు చేసింది. అనంత‌రం 230 ర‌న్స్ ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు 16.3 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ జ‌ట్టులో ర‌వీంద్ర జ‌డేజా 38 ర‌న్స్ చేయ‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ 36 ప‌రుగులు చేశారు. మిగ‌తా ఆటగాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేదు.

మ్యాచ్ అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. రియాన్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్లే తాను ఇక్కడ ఉన్నాను. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, మనందరికీ తెలిసినట్లే… కొన్ని రోజులు మనకు అన్నీ కలిసొస్తాయని భావించామ‌న్నారు. మరికొన్ని రోజులు మనం అనుకున్న రీతిలో బౌలింగ్ చేయలేక పోవచ్చ‌ని అన్నారు జైస్వాల్. ఇక రియాన్ ప‌రాగ్ జట్టు కోసం చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. మరింత బలంగా పుంజుకుని తిరిగి వస్తాడని నేను భావిస్తున్నట్లు తెలిపాడు.