4 ఓవర్లు 40 పరుగులు 4 వికెట్లు 9 డాట్ బాల్స్
న్యూఢిల్లీ : ఐపీఎల్ 19వ సీజన్ లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని , ఈసారి కప్పు ఎగురేసుకు పోవాలని కలలు కంటున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది అక్షర్ పటేల్ సారథ్యంలోని డిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది రాజస్తాన్ రాయల్స్ . ఆట ప్రారంభం నుంచే విరుచుకు పడ్డారు సూర్యవంశీ. తనకు తోడుగా ఉన్న జైశ్వాల్ నిరాశ పరిచాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన రియాన్ పరాగ్ దాడి చేయడం ప్రారంభించాడు. ఒకానొక దశలో 160 పరుగుల పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మిచెట్ స్టార్క్ ను రంగంలోకి దింపాడు.
తను వచ్చీ రావడంతోనే యంగ్ వండర్ బాయ్ సూర్యవంశీని బోల్తా కొట్టించాడు. వరుస వికెట్లతో రాజస్తాన్ కు చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఆ జట్టును తన అద్భుతమైన బంతులతో బెంబేలెత్తించాడు మిచెట్ స్టార్క్. తను 4 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు కూల్చాడు. ఇందులో 9 డాట్ బాల్స్ ఉండడం విశేషం. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 193 పరుగులు చేసింది. అనంతరం 19. 2 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది .





