పెద్ది సినిమా వివాదం వ‌సూళ్ల‌పై ప్ర‌భావం

యువ న‌టుల కెరీర్ ల‌ను నాశ‌నం చేస్తుంది

హైద‌రాబాద్ : బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పెద్ది మూవీ విడుద‌లైంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ , జ‌గ‌ప‌తి బాబు, శివ రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్పోర్ట్స్ నేప‌థ్యంగా దీనిని తెర‌కెక్కించాడు. అయితే తొలి పార్ట్ మూవీ బాగున్నా రెండో పార్టులో తేలి పోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున క‌లెక్ష‌న్స్ పై తీవ్ర ప్ర‌భావం చూపించింద‌ని స‌మాచారం. రోజు రోజుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్దిపై నెగిటివ్ టాక్ పెరిగింది. దీనిపై నిర్మాత సంజ‌య్ గుప్తా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆమెను శృంగార పరంగా అతిగా చూపిస్తున్నాయన్న ఆరోపణలతో ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ చిత్రంపై ఆన్‌లైన్‌లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై స్పందించారు. కెరీర్ పరిఢవిల్లే అవకాశాన్ని దక్కించు కోక ముందే సోషల్ మీడియా దానిని నాశనం చేయగలదని నొక్కి చెప్పారు గుప్తా. కొత్తగా పరిశ్రమలోకి వస్తున్న నటులు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • Related Posts

    డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

    ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

    త‌మిళ‌నాట సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా త్రిష్ కృష్ణ‌న్

    చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఇప్పుడు న‌టి త్రిష కృష్ణ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ త‌రుణంలో కావేరి సమ‌స్య గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డీఎంకే ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *