డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తులు రూ. 200 కోట్లు
సంచలన ప్రకటన చేసిన అవినీతి నిరోధక శాఖ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్కరొక్కరుగా బయట పడుతున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో కళ్లు చెదిరేలా ఆభరణాలు, నోట్ల కట్టలు , అక్రమ ఆస్తులు తేట తెల్లం అవుతున్నాయి. తాజాగా సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న నరహరి రావు ఆస్తులు ఏకంగా రూ. 200 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేసింది ఏసీబీ. హైదరాబాద్‌లోని షాలిబండ కెనరా బ్యాంక్‌లో ఉన్న సుంకరి నరహరి రావు లాకర్ నుండి ఏసీబీ (ACB) రూ. 1.50 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఇంతకు ముందే రూ. 13.05 కోట్ల విలువైన (మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైగా) ఆస్తులను గుర్తించారు.
అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణ సర్వే, భూ రికార్డుల శాఖ (మల్టీ జోన్-II) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును తెలంగాణ ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.24 ఎకరాల భూమి, 4 ఫ్లాట్లు, 2 భవనాలు… వీటి విలువ రూ. 13.05 కోట్లు (మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండడం విస్తు పోయేలా చేసింది.