తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

VijayaBhaskar · July 2, 2026
Spread the love

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించిన ఏపీ కూట‌మి స‌ర్కార్

అమ‌రావ‌తి : తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2025లో కేంద్రం 1,62,500 మెట్రిక్ టన్నుల MIS కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చర్యలు తీసుకుని 4.70 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.190 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది కూడా రైతుల‌కు అండ‌గా నిల‌వాల‌ని ఉద్దేశంతో కేజీకి 4 రూ ప్ర‌భుత్వం అంద‌చేసేందుకు సిద్ధ‌మైంది. రైతులకు ఎకరాలు లేదా పరిమాణ పరిమితులు విధించకుండా అన్ని అర్హులకు ప్రయోజనం అందించింది. 2026 కోసం కేంద్రం నుంచి2,16,250 మెట్రిక్ టన్నుల MIS అనుమతి పొందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 7.03 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ప్రతిపాదనలు పంపింది.

కర్ణాటకలో రైతుకు5 ఎకరాలు, 4 మెట్రిక్ టన్నుల పరిమితి ఉండ‌గా అక్కడ 80 వేల మెట్రిక్ టన్నులకే రూ.38 కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 4.7 ల‌క్ష‌ల‌ మెట్రిక్ టన్స్ కోనుగోలు చేసి రైతులకు పెద్ద ఎత్తున మద్దతు అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది. ఇక వైసీపీ హయాంలో రూ.1,990 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో బీమా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆ కారణంగా వెబ్‌సైట్ సైతం నిలిచి పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే ఆ కాలంలో రెండేళ్లు మాత్రమే పథకం అమలు చేసి మూడేళ్లు నిలిపి వేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.260 కోట్ల బకాయిలను గుర్తించి చెల్లింపులకు చర్యలు చేపట్టిందన్నారు.