శ్రీ సత్యసాయి జిల్లా : దివంగత సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి సవిత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను, కళాశాలలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 2014 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ లో కేవలం 32 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా మరో కొత్తగా పది ఎంజేపీ స్కూళ్లను ప్రారంభించామన్నారు ఎస్. సవిత.
వాటిలో అయిదు రాయలసీమలోనూ, మరో అయిదింటిని ఉత్తరాంధ్రలోనూ ఏర్పాటు చేశామన్నారు. వాటితో పాటు ఆరు బాలిక బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు మంత్రి. నసన్నకోట బీసీ గురుకులాన్ని కూడా జూనియర్ కళాశాల అప్ గ్రేడ్ చేశామన్నారు. ఇవేకాక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. డిమాండ్ ఉన్నచోట్ల వాటిని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే డిమాండ్ అధికంగా ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు . విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.





