ఎస్వీ మ్యూజియం పనులను వేగవంతం చేయాలి

తిరుమల : తిరుమ‌ల లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి మ్యూజియం అభివృద్ధి పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు అడిష‌న‌ల్ కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి వెంక‌య్య చౌద‌రి. త్వ‌ర‌లో స్వామి వారి వేదిక‌గ‌గా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోపు వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎస్వీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని గ్యాలరీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మ్యూజియం బయట పార్కింగ్, మైబైల్ కౌంటర్లు, పాద రక్షకాలు భద్రపరచే కేంద్రాల ఏర్పాటు గురించి పలు సూచనలు చేశారు ఏఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ పరిశీలనా కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఎస్ఈ వేణు గోపాల్, ఎలక్ట్రికల్ డిఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌లకు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు శ్రీ‌వారి భ‌క్త బాంధ‌వులు. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి).

  • Related Posts

    జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్…

    మీనాక్షి ఆల‌య ప్ర‌సాదం స్వీక‌రించిన సీఎం విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి టీవీకే ర‌మేష్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఆల‌య‌మైన మీనాక్షి సుంద‌రేశ్వ‌ర‌ర్ ఆల‌య ప్ర‌సాదాన్ని సీఎంకు స్వ‌యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *