ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు. 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం చేప‌డ‌తారు. 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది.

ఇక‌ ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి అవుతాయ‌ని పేర్కొంది టీటీడీ. 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖన సమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి ఉంటుంద‌ని తెలిపింది. 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు చేస్తార‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల‌కు విచ్చే భ‌క్తులు ఆయా తేదీల వారీగా త‌మ ద‌ర్శ‌నం కోసం ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి . విశేష ప‌ర్వ‌దినాల స‌మ‌యంలో స్వామి వారికి విశేష పూజ‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌.

  • Related Posts

    జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్…

    మీనాక్షి ఆల‌య ప్ర‌సాదం స్వీక‌రించిన సీఎం విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి టీవీకే ర‌మేష్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఆల‌య‌మైన మీనాక్షి సుంద‌రేశ్వ‌ర‌ర్ ఆల‌య ప్ర‌సాదాన్ని సీఎంకు స్వ‌యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *