సంస్కృతి ఉట్టి పడేలా భోగాపురం విమానాశ్రయం

విశాఖపట్నం జిల్లా : తెలుగు సంస్కృతి ఉట్టి ప‌డేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త‌యారైంది. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దీనిని స‌ర్వాంగ సుంద‌రంగా నిర్మించారు. ఇవాళ దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు ఈ సంద‌ర్బంగా సీఎం. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలుగు కళలు, సంస్కృతీ వారసత్వ వైభవాన్ని చాటేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అలంకరించారు.

విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతి ఏర్పాటు చేశారు. విమానాశ్రయ ప్రాంగణం లోపల ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు భౌగోళిక వారసత్వాన్ని చాటే బంగినపల్లి మామిడి లాంటి చిత్రాలను అలంకరించారు. ప్రత్యేకించి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్యంతో. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేశారు. . విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలు తెలియ చేసేలా ప్రయాణికుల కోసం ఎల్ఈడీ వాల్ ను ఏర్పాటు చేయ‌డం ఎయిర్ పోర్టులో ప్ర‌త్యేక‌త‌.

  • Related Posts

    మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల అరెస్ట్

    పాకిస్తాన్ : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్ర‌ధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ఆయ‌న‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతూ పీటీఐ పార్టీ సెప్టెంబ‌ర్ 27న దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇమ్రాన్…

    కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోసం ..? : ఎంకే స్టాలిన్

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చెన్నై వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా త‌మిళ‌నాడు టీవీకే స‌ర్కార్ ప్ర‌తిపాదించిన కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోస‌మ‌ని ప్ర‌శ్నించారు. బీచ్ సమీపంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *