సమ్మిళత విద్య బలోపేతం కోసం ప్ర‌య‌త్నం

అమ‌రావ‌తి : యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మ‌రో ఎంవోయూ చేసుకున్నాయి ఏపీ , ఆస్ట్రేలియా . ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం. స్పెషల్ ఎడ్యుకేటర్స్ కు ప్రత్యేక శిక్షణ, సాధారణ ఉపాధ్యాయులకు శాస్త్రీయ ఆధారిత శిక్షణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల అవసరాలకు అనుగుణమైన బోధనా వనరుల రూపకల్పన చేపట్టనున్నారు.

మూడో ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో సాంకేతిక ఆధారిత విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటునందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ వేదిక ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సమాచార వనరులు, వెల్‌నెస్ అసెస్ మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను పొందగలుగుతారు. పైలట్ కార్యక్రమంలో పాల్గొనే విద్యా సంస్థలకు ఉచితంగా అమలు చేయనున్నారు.

ప్రతిపాదిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అధునాతన సోలార్ పీవీ తయారీ, సోలార్ ప్యానెళ్ల‌ రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన పరిశోధనలు, అధ్యాపకుల సామర్థ్య అభివృద్ధి, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. సోలార్ ఫోటోవోల్టాయిక్(PV) తయారీ, సర్క్యులారిటీ రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీయేతర విద్య, శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం, అభివృద్ధి చేయడం, అమలు చేయడంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తన సహకారాన్ని అందించనుంది. సోలార్ సెల్ డివైజ్ ఫిజిక్స్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, క్యారెక్టరైజేషన్, రిలయబిలిటీ ఇంజనీరింగ్, రీసైక్లింగ్, భద్రత, నిర్వహణ, ఇన్ గాట్ తయారీ, వాఫరింగ్ సాంకేతికతలు వంటి అంశాలపై కరిక్యులమ్, లెర్నింగ్ మెటీరియల్స్, అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్, ట్రైనింగ్ కంటెంట్ ను రూపొందించనుంది.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *