newsseals.com

చెన్నైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ న‌గ‌రం : సీఎం

September 3, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. చెన్నైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ న‌గ‌రాన్ని నిర్మించ బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సదుపాయంలో క్రీడాకారులు , కోచ్‌ల కోసం వసతితో సహా ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయని ప్ర‌క‌టించారు. జోసెఫ్ విజయ్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలోని రూల్ 110 కింద చెన్నైలో ప్రపంచ స్థాయి తమిళనాడు ఒలింపిక్ నగరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్ల‌డించారు. తమిళనాడు సీఎంఓ ప్రకారం ఈ ఒలింపిక్ నగరాన్ని తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తుందన్నారు. ఇందులో ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, అత్యాధునిక క్రీడా పరికరాలు, ఒక ఉన్నత పనితీరు శిక్షణా కేంద్రం, ప్రత్యేక క్రీడా విజ్ఞాన , క్రీడా వైద్య కేంద్రాలు ఉంటాయని తెలిపారు.

ఈ సదుపాయంలో క్రీడాకారులు, కోచ్‌ల కోసం వసతితో సహా ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు సీఎం. ఒలింపిక్ సిటీ లక్ష్యం అథ్లెట్లకు అధునాతన శిక్షణ , సహాయక సౌకర్యాలను అందించడానికి ఒక సమీకృత క్రీడా కేంద్రాన్ని సృష్టించడం అన్నారు. ఇది తమిళనాడు క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలు , ఇతర అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో మరిన్ని పతకాలు గెలుచు కోవడానికి సహాయ పడుతుంద‌న్నారు. నగరంలో ఫార్ములా 1-4 రేసులను నిర్వహించడానికి చెన్నైలో ఒక ప్రత్యేక మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 2028 చివరి నాటికి దేశంలోకి ఫార్ములా 1 రేసింగ్‌ను తిరిగి తీసుకు రావాలనే దార్శనికతతో, మోటార్‌స్పోర్ట్స్‌ను పర్యవేక్షించడానికి జూన్‌లో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (MYAS) ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

Related News