newsseals.com

తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ మార్పు ..?

September 14, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కారణంగా మరో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పదవి కోల్పోనున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త‌ప్పుకోనున్నారు. ఇప్ప‌టికే దీపా దాస్ మున్షీని ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొల‌గించింది సీఎం సూచ‌న‌ల మేర‌కు ఏఐసీసీ. రేవంత్ రెడ్డి వైఖరితో విసిగి పోయి, ఆయన ఏకపక్ష ధోరణిని అరికట్టేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా AICC నియమించింది. తన , తన సోదరుల అక్రమాలపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం ద్వారా మీనాక్షి నటరాజన్‌ను తొలగించేందుకు రేవంత్ రెడ్డి పావులు కదిపారు.

కొండా సురేఖ తొలగింపు వ్యవహారంపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నందున, మీనాక్షి నటరాజన్‌ను నేరుగా తొలగించడానికి బదులుగా ‘ఉన్నత విద్య’ను కారణంగా చూపిస్తూ AICC ఈ మార్పు చేస్తోందని స‌మాచారం. మీనాక్షి నటరాజన్ 10 నెలల పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ల‌నున్నారు. ఈ కారణాన్ని సాకుగా చూపించి, నిబ‌ద్ద‌త క‌లిగిన మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను త‌ప్పించేందుకు పావులు క‌దుపుతోంది హైక‌మాండ్. దాదాపుగా త‌న‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింద‌ని, ఇక ఆమె స్థానానికి బ‌దులుగా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ప్ర‌స్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రేసులో ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, శక్తిసిన్హ్ గోహిల్, అశోక్ గెహ్లాట్ ఉన్నట్లు సమాచారం.

Related News