బ్లాక్ మనీని వైట్ గా మార్చుకుంటున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఆయన కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారాల గురించి ఆధారాలతో సహా బయట పెట్టారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. MEDI COVER ఆసుపత్రిలో దుంప శిరీష ద్వారా రూ.13,200 కోట్లు పెట్టుబడి పెట్టి, అతని కూతురు ద్వారా రేవంత్ రెడ్డి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. MAX BIEN అనే ఫార్మా కంపెనీలో రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డితో పాటు దుంప శిరీష అనే మహిళ కూడా డైరెక్టర్‌గా ఉందన్నారు. రేవంత్ రెడ్డి కూతురు కొంపల్లిలో నిర్మిస్తున్న భారీ కార్పొరేట్ స్కూల్లో కూడా దుంప శిరీష పార్ట్‌నర్‌గా ఉందని బాంబు పేల్చారు మన్నె క్రిశాంక్.
అదే దుంప శిరీష MEDICOVER ఆసుపత్రిలో కూడా ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉందని , దీనిపై దమ్ముంటే కాదని చెప్పాలని సవాల్ విసిరారు సీఎంకు. సహృదయ మాతృ సంస్థ ద్వారా MEDICOVER ఆసుపత్రి ఆదాయం గత రెండేళ్లుగా 689% పెరిగిందన్నారు. అయితే ఈ MEDICOVER ఆసుపత్రిని రూ.13,300 కోట్లకు అమ్మేసి.. బ్లాక్ మనీ అంతా వైట్ మనీగా మార్చుకున్నారని ఆరోపించారు క్రిశాంక్. బీజేపీకి దమ్ముంటే రేవంత్ రెడ్డిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వేరే రాష్ట్రాల నుండి రేవంత్ రెడ్డి కుటుంబం లోన్ తెస్తున్నారని ఎందుకని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలలో లోన్లు తీసుకున్న MEDICOVER ఆసుపత్రిని ప్రమోట్ చేసింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు.