ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగు పరచుకుంటూ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యాశాఖ జ్ఞాన దీప్తి కార్యక్రమం ఆధ్వర్యంలో బుధవారం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ లర్నింగ్ పై వారం రోజులుగా నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. గణితం, సైన్స్ సబ్జెక్టులకు ఎంతో ప్రాధాన్యత ఉన్నందున సృజనాత్మకతతో సాంకేతికతను వినియోగించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఉద్యోగాలు, వృత్తులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఏఐ వంటి సాంకేతికతను కూడా వినియోగించి బోధించేందుకు కృషి చేయాలన్నారు.

ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, ఎఫ్ ఎల్ఎన్ఏఎక్స్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను రాసే విద్యార్థులు కూడా ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకొని ప్రతిభ చాటుతున్నారని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులందరూ ప్రతిభ చాటేలా బోధించాలని వంద శాతం ఫలితాలు రావాలని ఆదేశించారు. ముఖ్యమైన పాఠ్యాంశాలు, పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా సాధన చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గట్టు, కేటీ దొడ్డి వంటి వెనుకబడిన మండలాల్లోనూ ఇటీవలి కాలంలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారని, ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తమ పాఠశాలలలో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

  • Related Posts

    ఎల్ నినో ఎఫెక్ట్ ఉపాధిపై స‌ర్కార్ ఫోక‌స్

    హైద‌రాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టిన తరుణంలో, గ్రామీణ కూలీలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి…

    పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గ‌మ్య‌స్థానం కావాలి : సీఎస్

    హైద‌రాబాద్ : తెలంగాణ పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానం కావాల‌ని అన్నారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు. బుధ‌వారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ మొదటి పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ పెట్టుబడి వ్యవస్థను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *