అమీన్ పీర్ ద‌ర్గా ఉత్స‌వాల‌కు ఆహ్వానం

అమ‌రావ‌తి : ఏపీలోని కడప అమీన్ పీర్ దర్గా పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఉర్సు హాజరు కావలసిందిగా ఈ రోజు ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి కె.ఎస్.ఎస్. ఆరీఫుల్లా హుస్సేనీ ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ నెల 24 నుండి 29 వరకు జరగనున్న ఈ ఉత్సవాలని హాజరు కావాలని కోరారు. ఈ సంద‌ర్భంగా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎంను కలిసిన వారిలో దర్గా మేనేజర్ ఎండి అలీఖాన్, సయ్యద్ గౌస్, అమీర్ బాషా తదితరులు ఉన్నారు.

ఇక అమీన్ పీర్ ద‌ర్గాను ప్ర‌తిరోజూ భ‌క్తులు భారీగా ద‌ర్శించుకుంటారు. దేశం న‌లువైపు నుంచి త‌ర‌లి వ‌స్తారు. ఈ ద‌ర్గాకు న‌టీ న‌టులు కూడా హాజ‌ర‌వుతారు. కడప నగరంలో ఉన్న ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రం. దీనిని పెద్ద దర్గా , అస్తానా-ఎ-మఖ్దూమ్ ఇలాహీ దర్గా అని కూడా పిలుస్తారు. అమీన్ పీర్ దర్గా చరిత్రకు సుమారు 300–400 సంవత్సరాల ప్రాచీనత ఉందని చెబుతారు ఇక్క‌డి స్థానికులు. సూఫీ సంత్ ఖ్వాజా పీరుల్లా హుస్సేనీ ఈ సంప్రదాయానికి ప్రధాన వ్యక్తిగా గుర్తించ బడుతున్నారు. కడపలో ఈ దర్గా ఏర్పడిన కాలాన్ని సాధారణంగా 17వ శతాబ్దం చివరి భాగం, ముఖ్యంగా 1683 ప్రాంతంగా పేర్కొంటారు ఇక్కడ పీరుల్లా హుస్సేనీ, ఆరిఫుల్లా హుస్సేనీ II వంటి సూఫీ సంతుల సమాధులు ఉన్నాయి.

అమీన్ పీర్ దర్గా ప్రత్యేకత మత సామరస్యం. ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు, ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడకు వస్తుంటారు. అందుకే దీనిని కడపలోని ముఖ్యమైన సామరస్య పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు.

  • Related Posts

    గవిసిద్దేశ్వర స్వామీజీకి స‌ర్కార్ ఆహ్వానం

    బెంగ‌ళూరు : మైసూరు దసరా ప్రారంభోత్సవానికి గవిసిద్దేశ్వర స్వామీజీని ఆహ్వానించింది క‌ర్ణాట‌క స‌ర్కార్. | ఈ ఏడాది దసరా ఉత్సవాలను గవిసిద్దేశ్వర స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించాలని ఇటీవల నిర్ణయించింది. కొప్పళ: మైసూరు డిప్యూటీ కమిషనర్ లక్ష్మీకాంత్ రెడ్డి జి కొప్పళలోని…

    టీటీడీ టికెట్ల స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి

    తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెలా జారీ చేసే టికెట్ల ద‌ర్శ‌నం బుకింగ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీటీడీ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *