Monday, 2 November 2026

‘మురాసు’ తుపాను ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి : సీఎం

newsseals-APCM

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమ‌వారం పంట బీమాకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాలు , వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట బీమా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ప్రభుత్వం పంట బీమాతో పాటు పెట్టుబడి రాయితీలను (ఇన్‌పుట్ సబ్సిడీలు) కూడా అందిస్తోందని చెప్పారు. ఖరీఫ్ పంట సీజన్ ముగింపు దశలో ఉన్నందున, రైతులందరికీ పంట బీమాపై అవగాహన కల్పించాలని స్ప‌స్టం చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీమా పొందేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదే క్ర‌మంలో కోస్తా ఆంధ్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న ‘మురాసు’ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఈరోజు ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో తుపానును ఎదుర్కొనేందుకు చేపట్టిన ఏర్పాట్లపై ఆయన ‘రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ’ (RTGS) అధికారులు , జిల్లా కలెక్టర్లతో చర్చించారు. ‘రెమాల్’ తుపాను సృష్టించిన విధ్వంసం తర్వాత అనేక ప్రాంతాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని అన్నారు. కాగా ఇప్పుడు ‘మురాసు’ తుపాను ప్రభావాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు. తుపాను గాలుల కారణంగా దక్షిణ కోస్తా ఆంధ్ర , రాయలసీమ జిల్లాల్లో సుమారు 8,000 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేయబడింది. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు సీఎం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *