newsseals.com

టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్..?

November 5, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన‌, జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక న‌టుడు ర‌జ‌నీకాంత్. ఆయ‌న‌ను అంతా త‌లైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. త‌ను వ‌య‌సు పెరిగినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌న మేన‌జ‌రిజంతో ఆక‌ట్టుకుంటూ దూసుకు పోతున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన తాజా సీక్వెల్ మూవీ జైల‌ర్ -2 దుమ్ము రేపింది. రూ. 700 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది వ‌ర‌ల్డ్ వైడ్ గా . దీంతో స‌ద‌రు సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సూప‌ర్ స్టార్ తో జైల‌ర్ -3 సీక్వెల్ తీస్తున్నామ‌ని వెల్ల‌డించింది. దీంతో ద‌ర్శ‌కుడు బిజీగా మారి పోయాడు. త‌ను క‌థ‌ను కూడా సిద్దం చేసిన‌ట్లు టాక్. మొత్తంగా మ‌రోసారి జాక్ పాట్ కొట్టే ప‌నిలో ఉన్నాడు నెల్స‌న్ దిలీప్ కుమార్.

ఇదిలా ఉండ‌గా ఈ సీక్వెల్ కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటన ‘జైలర్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. ఆ పాత్ర యొక్క శక్తివంతమైన తెరపై ఉనికి, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు , గుర్తుండిపోయే సంభాషణలు సినిమా ప్రజాదరణకు దోహద పడ్డాయి. ఈ ఫ్రాంచైజీ మరో ఉత్కంఠ భరితమైన కథాంశం , కొత్త పాత్రలతో కొనసాగుతుందా లేదా అని అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘జైలర్ 3’ గురించి చర్చలు ఊపందు కుంటున్నప్పటికీ దాని నిర్మాణ షెడ్యూల్, నటీనటులు , విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. నెల్సన్ దిలీప్‌కుమార్ , రజనీకాంత్ మళ్లీ కలిసి పనిచేయవచ్చనే వార్త ఇప్పటికే సినీ ప్రేమికులలో గణనీయమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. ప్రస్తుతానిక, మూడవ భాగం గురించి ఒక నిర్ధారణకు రావడానికి ముందు అభిమానులు అధికారిక అప్‌డేట్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.

Related News