newsseals.com

శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘ‌నంగా హోమం

November 15, 2026 · VijayaBhaskar

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష పూజలు, హోమం, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, స్వామి వారికి నివేదన, హారతి నిర్వహించారు. హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ నవగ్రహ హోమం నిర్వహించారు అంగ‌రంగ వైభ‌వోపేతంగా. ఇదే క్ర‌మంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కల్యాణం చేప‌ట్టారు.

సాయంత్రం 5.30 గంటలకు జ‌రిగిన‌ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కల్యాణోత్సవానికి భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. గృహస్తులు రూ.500 చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ దివ్య కాళ్యాణ మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దామోదరం, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related News