అడ‌వి బిడ్డ‌లూ ఆందోళ‌న చెంద‌కండి : చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని గిరిజ‌నుల సంక్షేమం కోసం ఏపీ కూటమి స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. చట్ట పరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు కూడా తీసుకోవాలని సూచించారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్‌ 1లోకి మార్చాలని, పోలవరం జిల్లాను జోన్ 2లో చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాక్సైట్ మైనింగ్ విషయంలో గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. గత పాలకులు తమ అవినీతి కారణంగా బాక్సైట్ లీజుల అంశం ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులకు వెళ్లిందని గుర్తు చేశారు. గిరిజనుల హక్కులకు, మనోభావాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు ఉండవని….ఈ విషయంలో ఎవరి ట్రాప్ లోనూ పడవద్దని సిఎం సూచించారు. అలాగే 1/70 అమలు విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

ఇదే విషయాన్ని గిరిజన సంఘాలకు చెప్పాలని సిఎం సూచించారు. అరకు కాఫీని ప్రమోట్ చేసినా…గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, రవాణా సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినా అది కూటమి ప్రభుత్వం గిరిజనులపై చూపిన బాధ్యత అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి అభివృద్ది జరిగినప్పుడే…వారి జీవన ప్రమాణాలు మారినప్పుడే నిజమైన అభివృద్ది అని ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. గిరిజన సంఘాలతో చర్చలకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గిరిజన ప్రజా ప్రతినిధులకు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. సిఎం సూచన మేరకు త్వరలోనే గిరిజన సంఘాలను ఆహ్వానించి చర్చించనున్నారు.

  • Related Posts

    మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల అరెస్ట్

    పాకిస్తాన్ : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్ర‌ధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ఆయ‌న‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతూ పీటీఐ పార్టీ సెప్టెంబ‌ర్ 27న దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇమ్రాన్…

    కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోసం ..? : ఎంకే స్టాలిన్

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చెన్నై వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా త‌మిళ‌నాడు టీవీకే స‌ర్కార్ ప్ర‌తిపాదించిన కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోస‌మ‌ని ప్ర‌శ్నించారు. బీచ్ సమీపంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *