బంగారం బ్యాగును భ‌క్తుడికి అప్ప‌గించిన టీటీడీ

తిరుప‌తి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యాగును తెరిచి ప‌రిశీలించారు. బ్యాగులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ఆ బ్యాగు హైదరాబాద్‌కు చెందిన మహేష్ కు చెందినదిగా గుర్తించారు.

అప్పటికే తాను బ్యాగును మరిచి పోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించారు. పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా స‌ద‌రు భ‌క్తుడికి అప్పగించారు. ఈసంద‌ర్భంగా పోయింద‌ని అనుకుని తీవ్ర మ‌నో వేద‌న‌కు గురైన భ‌క్తుడు ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇదంతా ఆ శ్రీ వేంక‌టేశ్వురుడి మహిమేన‌ని పేర్కొన్నాడు. తాను పోగొట్టుకున్న బ్యాగును ఉన్న‌ది ఉన్న‌ట్టుగా అందించిన టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    24 నుంచి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

    తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు.…

    ఘ‌నంగా తిరునక్షత్ర మహోత్సవం

    రంగారెడ్డి జిల్లా : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళా శాసనములతో శంషాబాద్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాంగణంలో శ్రీ సుదర్శన పెరుమాళ్ “తిరునక్షత్ర మహోత్సవం” మహావైభవంగా జరిగింది. విశ్వశాంతిని, లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *