ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : దివంగ‌త సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి స‌విత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను, కళాశాలలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 2014 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ లో కేవలం 32 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా మరో కొత్తగా పది ఎంజేపీ స్కూళ్లను ప్రారంభించామన్నారు ఎస్. స‌విత‌.

వాటిలో అయిదు రాయలసీమలోనూ, మరో అయిదింటిని ఉత్తరాంధ్రలోనూ ఏర్పాటు చేశామన్నారు. వాటితో పాటు ఆరు బాలిక బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు మంత్రి. నసన్నకోట బీసీ గురుకులాన్ని కూడా జూనియర్ కళాశాల అప్ గ్రేడ్ చేశామన్నారు. ఇవేకాక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నామని ప్ర‌క‌టించారు. డిమాండ్ ఉన్నచోట్ల వాటిని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే డిమాండ్ అధికంగా ఉందని మంత్రి సవిత స్ప‌ష్టం చేశారు . విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అద్భుతంగా ప‌ని చేస్తున్నార‌ని కొనియాడారు.

  • Related Posts

    మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల అరెస్ట్

    పాకిస్తాన్ : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్ర‌ధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ఆయ‌న‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతూ పీటీఐ పార్టీ సెప్టెంబ‌ర్ 27న దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇమ్రాన్…

    కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోసం ..? : ఎంకే స్టాలిన్

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చెన్నై వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా త‌మిళ‌నాడు టీవీకే స‌ర్కార్ ప్ర‌తిపాదించిన కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోస‌మ‌ని ప్ర‌శ్నించారు. బీచ్ సమీపంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *